Sun Dec 22 2024 21:45:10 GMT+0000 (Coordinated Universal Time)
Vijay Devarakonda : రష్మిక ఫేక్ వీడియో పై విజయ్ ఫైర్.. ఏమన్నాడో తెలుసా..?
రష్మిక ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ ఫైర్ అయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో..
Vijay Devarakonda : కొన్ని రోజులుగా హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. డీప్నెక్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఒక అమ్మాయిని రష్మిక పేస్ తో మార్ఫింగ్ చేసి ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ముందుగా ఆ వీడియోలో ఉన్నది రష్మిక అని పొరబడినా.. ఆ తరువాత రష్మిక కాదని తెలుసుకొని వీడియో పై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీని పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నుంచి నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, చిన్మయి పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ విషయం పై రష్మిక స్నేహితుడు విజయ్ దేవరకొండ కూడా ఫైర్ అవుతూ రియాక్ట్ అయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ఇలాంటివి భవిషత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇలాంటి వాటిని త్వరగా అరికట్టి, శిక్షించేలా సైబర్ డిపార్ట్మెంట్ లో కూడా చట్టం తీసుకు రావాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఈ విషయం పై పలువురు రాజకీయ నాయకులు కూడా రెస్పాండ్ అవుతూ ట్వీట్స్ చేయడంతో.. దేశవ్యాప్తంగా ఈ విషయం చాలా సీరియస్ అయ్యింది. దీంతో కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి.. సోషల్ మీడియా విషయంలో కొన్ని సూచనలు తీసుకొచ్చింది. ఇటువంటి మార్ఫింగ్ వీడియోలు చేయడం లేదా వాటిని వ్యాప్తి చేయడం కూడా నేరం క్రింద భవిస్తూ వారికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66D ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష, రూ.1లక్ష జరిమాణం విధిస్తున్నట్లు ప్రకటించింది.
Next Story