Sun Dec 22 2024 21:56:36 GMT+0000 (Coordinated Universal Time)
Vijay - Rashmika : అన్స్టాపబుల్ షోలో విజయ్, రష్మిక లవ్స్టోరీపై క్లారిటీ..!
అన్స్టాపబుల్ షోలో విజయ్, రష్మిక లవ్స్టోరీని బాలయ్య బయటపెట్టారా..? విజయ్ ఫోన్ చేసినప్పుడు ఏం జరిగింది..?
Vijay Devarakonda - Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఉన్న బంధం ఏంటనేది..? ఒక మిలియన్ డాలర్ ప్రశ్నలా మారిపోయింది. వారిద్దరూ కేవలం స్నేహితులా..? లేక ప్రేమకులా..? అనే దానిపై ఒక క్లారిటీ లేక అభిమానులు కూడా తికమక పడుతున్నారు. విజయ్ అండ్ రష్మిక తమ రిలేషన్ ఒక మంచి ఫ్రెండ్షిప్ అనే చెప్పుకొస్తున్నప్పటికీ.. నెటిజెన్స్ మాత్రం వారిద్దరూ ప్రేమికులు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఆధారాలు చూపిస్తూ వైరల్ చేస్తుంటారు.
ఇక ఈ మిలియన్ డాలర్ ప్రశ్నకి ఎప్పుడు జవాబు దొరుకుతుందా..? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా రష్మిక, బాలయ్య అన్స్టాపబుల్ షోకి రావడం, ఆ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ఫోన్ చేయడం వంటి జరగడంతో.. ఈ షోలో బాలకృష్ణ వీరిద్దరి ప్రేమని బయట పెట్టబోతున్నారేమో అని అభిమానులంతా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూశారు. తాజాగా నేడు ఆ ఎపిసోడ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇంతకీ అసలు ఎపిసోడ్ ఏం జరిగింది..?
ఈ ఎపిసోడ్ లో బాలయ్య.. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న 'యానిమల్' మూవీలోని రణబీర్ ఫోటోని, అర్జున్ రెడ్డి సినిమాలోని విజయ్ ఫోటోని చూపించి "ఇద్దరిలో ఎవరు లుక్ బాగుందని..?" ప్రశ్నించారు. ఈక్రమంలోనే విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి లైన్ లో పెట్టారు బాలయ్య. ఇక ఆ ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. "నాకు అర్జున్ రెడ్డి సినిమాకి ప్రత్యేక కనెక్షన్ ఉంది, ఇటు యానిమాలో మూవీలో నేను నటిస్తున్నాను. కాబట్టి నాకు రెండు నచ్చినవే" అంటూ చెప్పుకొచ్చారు.
అర్జున్ రెడ్డితో ప్రత్యేక కనెక్షన్ అంటే ఏంటని బాలయ్య ప్రశ్నించగా.. "హైదరాబాద్ లో చూసిన మొదటి సినిమా అదే" అంటూ చెప్పుకొచ్చారు. కానీ పెద్దగా నమ్మేలా లేదంటూ బాలయ్య కూడా కొట్టిపారేశారు. ఇంతలో రణబీర్ కలుగజేసుకొని.. "విజయ్, బాలయ్య సార్ లవ్స్ రష్మిక అంటున్నారు" అని చెప్పారు. దానికి విజయ్ రియాక్ట్ అవుతూ.. "హా నాకు తెలుసు. ఆమె ఆయనకు క్రష్మిక" అంటూ బదులిచ్చారు.
ఫైనల్లీ బాలయ్య మాట్లాడుతూ.. ''విజయ్, ఐ లవ్ రష్మిక. మరి నువ్వు ఎవర్ని లవ్ చేస్తున్నావు'' అని ప్రశ్నించారు. దీనికి విజయ్ సమాధానం ఇస్తూ.. "ఐ లవ్ సందీప్ వంగా" అంటూ డైరెక్టర్ పేరు చెప్పి మాట దాటేశారు. దీంతో బాలయ్య కూడా వారిద్దరి మధ్య ప్రేమని బయటపెట్టలేకపోయారు. అయితే ఈ విజయ్ తో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో రష్మిక.. ఫోన్ స్పీకర్ లో ఉంది జాగ్రత్తగా మాట్లాడమని చెప్పడం, విజయ్ రష్మికని ‘వాట్సాప్ రే’ అంటూ ప్రేమగా పిలవడం, రష్మిక సిగ్గుపడడం, అలాగే రష్మిక ఫోన్ లో విజయ్ పేరు ఏమని సేవ్ చేశావు అంటే చూపించకపోవడం అభిమానుల సందేహాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
Next Story