Mon Dec 23 2024 05:39:04 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేస్తున్న ఖుషి మూవీ.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
తెలుగు వెర్షన్ ప్రీ-బిజినెస్ విలువ దాదాపు 50 కోట్లు. నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో
లైగర్ భారీ ఫ్లాప్ అనంతరం విజయ్ దేవరకొండ నుండి వచ్చిన సినిమా ఖుషి . విజయ్ దేవరకొండ రొమాంటిక్ జోనర్ సినిమా.. అది కూడా సమంతతో కలిసి చేస్తూ ఉండడంతో.. భారీ విజయాన్ని అందుకుంటుందని భావించారు. అయితే, ఖుషికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవడంలో విఫలమైంది.
ఖుషి తెలుగు వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్
నైజాం - 13.5 కోట్లు
సీడెడ్ - 2.6 కోట్లు
UA - 2.95 కోట్లు
తూర్పు - 1.55 కోట్లు
వెస్ట్ - 1.15 కోట్లు
గుంటూరు - 1.5 కోట్లు
కృష్ణ - 1.4 కోట్లు
నెల్లూరు - 0.8 కోట్లు
ఏపీ/తెలంగాణ - 25.45 కోట్లు
ROI - 3 కోట్లు
ఓవర్సీస్ – 9 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా- 37.45 కోట్లు
తెలుగు వెర్షన్ ప్రీ-బిజినెస్ విలువ దాదాపు 50 కోట్లు. నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో పర్వాలేదనిపించే కలెక్షన్స్ వచ్చాయి. నైజాంలో 75% రికవరీ ఉండగా, ఆంధ్రలో నష్టాలను చవిచూశారు. ఖుషి ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రావడంతో బాగానే లాభాలు వచ్చాయి. ఈ చిత్రం తమిళ వెర్షన్ మాత్రం సూపర్ హిట్ అయింది. తమిళనాడులో ఈ చిత్రం 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మొత్తంమీద బాక్సాఫీస్ వారీగా, ఈ చిత్రం తెలుగు వెర్షన్ అబోవ్ యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ సాధించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం మంచి ప్లస్ గా మారింది.
తాజాగా ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్ 1 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కు నిజంగా ఇది ఖుషిని ఇచ్చే వార్త.
Next Story