Sun Dec 22 2024 05:17:49 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్-సమంత సినిమాకి పవన్ టైటిల్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా ?
విజయ్ దేవరకొండ - సమంత జోడీ అనేసరికి ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి, మరో మజిలీ లాగా ఉంటుందేమో అనుకుంటున్నారు అంతా. కానీ ..
హైదరాబాద్ : సమంత.. చైతన్యతో విడాకుల తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ కే ఎక్కువగా కమిట్ అవుతోంది. శాకుంతలం, యశోద సినిమాలు దాదాపు పూర్తయ్యాయి. లేడీ ఓరియంటెడ్ మూవీస్ నుంచి.. ఈసారి లవ్ స్టోరీవైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమాలో సమంత హీరోయిన్ అని కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మజిలీ డైరెక్టర్.. శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటి వరకూ వీడీ 11గా చెప్పిన ఈ సినిమా టైటిల్ ను చిత్రబృందం... ఈ ఉదయం టైటిల్ తో పాటు సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లను విడుదల చేసి రౌడీ-సమంత అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ - సమంత జోడీ అనేసరికి ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి, మరో మజిలీ లాగా ఉంటుందేమో అనుకుంటున్నారు అంతా. కానీ ఈ సినిమా కాస్త కొత్తగా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. విజయ్ - సమంత జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పవన్ సినిమా టైటిల్ "ఖుషి" అని ఖరారు చేశారు. అలాగే సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లను విడుదల చేసింది చిత్రబృందం. "ఖుషి నువ్వు కనబడితే.. ఖుషీ నీ మాట వినపడితే" అనే పాట కూడా వినిపించింది.
పవన్ సినిమా టైటిల్.. మోషన్ పోస్టర్లో ఇద్దరికీ కొంగుముడి వేసి కనిపించడంతో.. మళ్లీ ఖుషి మ్యాజిక్ వర్కవుట్ అవుతుందని అంచనాలు మొదలయ్యాయి. ఒకరకంగా ఇది పవన్ అభిమానులకు గుడ్ న్యూసనే చెప్పాలి. ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పుడే ప్రకటించడం విశేషం. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
Next Story