Mon Dec 23 2024 05:49:28 GMT+0000 (Coordinated Universal Time)
వంద కుటుంబాలకు లక్ష పంచనున్న విజయ్ దేవరకొండ
తాజాగా తన మాటను నిలబెట్టుకున్నారు విజయ్. 100 కుటుంబాలను ఎంపికచేసి ఆ లిస్టును విజయ్ సోషల్
టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. విజయ్ ‘ఖుషి’ చిత్రం ద్వారా తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. సక్సెస్ మీట్లో భాగంగా విజయ్ మాట్లాడుతూ ఓ వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కును వారం పదిరోజుల్లో అందజేస్తానని అన్నారు.
తాజాగా తన మాటను నిలబెట్టుకున్నారు విజయ్. 100 కుటుంబాలను ఎంపికచేసి ఆ లిస్టును విజయ్ సోషల్ మీడియాలో గురువారం రిలీజ్ చేశారు. వంద కుటుంబాలను ఎంపిక చేశాం.. నేను చేసే ఈ చిన్న సాయం మీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతుందని భావిస్తున్నానని విజయ్ అన్నాడు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు లోని ప్రాంతాల నుంచి కూడా విజేతలను ఎంపిక చేశాడు. "ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్ ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా" అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు విజయ్ దేవరకొండ.
Next Story