Mon Dec 23 2024 06:43:43 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ కు ఊహించని షాకిచ్చిన సెన్సార్.. ఏకంగా ఏడు సీన్లు కట్ !
తాజాగా లైగర్ సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని షాకిచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు సీన్లను కట్ చేయాలని..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా సినిమా లైగర్. పాన్ ఇండియా వైడ్ గా ఆగస్టు 25న విడుదలయ్యేందుకు ఈ సినిమా సన్నద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లైగర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ మూవీ అంటేనే బోల్డ్ సీన్లు , డైలాగ్ లు ఉంటాయి. మరి ఊరమాస్ డైరెక్టర్, రౌడీ హీరో కాంబినేషన్లో వస్తున్న లైగర్ లో ఇంకెన్ని ఎఫ్ డైలాగ్స్, సీన్లుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా లైగర్ సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని షాకిచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు సీన్లను కట్ చేయాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు లైగర్ కు యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేయగా.. సినిమాలో ఎఫ్-వర్డ్ సీన్స్ చాలానే ఉన్నాయని సమాచారం. వాటన్నింటినీ తొలగించాలని సెన్సార్ బోర్డు అబ్జెక్ట్ చేసింద.
సెన్సార్ బోర్డు సూచన మేరకు ఆయా సీన్లను తొలగించి, ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. సెన్సార్ సూచన మేరకు కొన్ని సీన్లను తీసేసినా.. ఇంకా బోల్డ్ సీన్లుంటాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ఛాయ్ వాలాగా కనిపించబోతున్నాడు. ఛాయ్ వాలా నుంచి బాక్సర్ గా ఎలా ఎదిగాడన్నదే సినిమా కథ. విజయ్ కు సరసన అనన్య పాండే నటించగా.. తల్లిగా రమ్యకృష్ణ నటించారు.
Next Story