Mon Dec 23 2024 12:07:26 GMT+0000 (Coordinated Universal Time)
Rashmika Mandanna : ఆనంద్ దేవరకొండ రష్మికని ఏమని పిలుస్తాడో తెలుసా..?
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్, రష్మికని ఏమని పిలుస్తాడో తెలుసా..?
Rashmika Mandanna : టాలీవుడ్ ఆన్స్క్రీన్ లవ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఆఫ్ స్క్రీన్ లో ఎలాంటి రిలేషన్షిప్ ని మెయిన్టైన్ చేస్తున్నారు అనేది చాలా కాలం నుంచి ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే వారి సాన్నిహిత్యం చూస్తే మాత్రం.. అందరికి ప్రేమికులు లాగానే కనిపిస్తారు. కాగా రష్మిక కేవలం విజయ్ తోనే మాత్రమే కాదు, విజయ్ ఫ్యామిలీతో కూడా మంచి రిలేషన్ ని మెయిన్టైన్ చేస్తున్నారు.
నిన్న విజయ్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో రష్మిక తన సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేసారు. ఆనంద్ ఫోటోని షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే ఆనంద్' అని పోస్ట్ వేశారు. ఇక ఆ పోస్ట్ పై ఆనంద్ రియాక్ట్ అవుతూ.. "థాంక్యూ రషీ. కానీ ఈ కామెడీ ఫోటో ఏంటి" అంటూ కామెంట్ చేసారు. దానికి రష్మిక రియాక్ట్ అవుతూ.. "నేను ఫోటో అడిగినప్పుడు నువ్వు అదే పోజ్ ఇచ్చావు" అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ ఫన్నీ చాటింగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ చాటింగ్ ద్వారా ఆనంద్ దేవరకొండ, రష్మికని.. 'రషీ' అని పిలుస్తారని కూడా తెలిసింది. కాగా ఈ ఈ చాటింగ్ చూసిన నెటిజెన్స్, అభిమానులకు.. విజయ్-రష్మిక ప్రేమ వార్తలపై మరింత నమ్మకం కలుగుతుంది. ఇటీవల విజయ్, రష్మిక కూడా ఇలాగే పబ్లిక్ గా సోషల్ మీడియాలో ఫన్నీ చాటింగ్ చేసుకున్నారు. మరి ఈ ఆన్ స్క్రీన్ లవ్ కపుల్ ఆఫ్ స్క్రీన్ లో ఎప్పుడు తమ ప్రేమ వార్తని తెలియజేస్తారో చూడాలి.
Next Story