Mon Dec 23 2024 14:17:17 GMT+0000 (Coordinated Universal Time)
VD12 లో 'కానిస్టేబుల్'గా విజయ్ దేవరకొండ..
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న VD12 నుంచి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రీసెంట్ గా 'ఖుషి' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక విజయ్ తదుపరి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. 'జెర్సీ' మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో VD12, 'గీతగోవిందం' దర్శకుడు పరుశురామ్ తో VD13 సినిమాలు చేస్తున్నాడు.
కాగా VD12 గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడట. టాలీవుడ్ నటుడు 'మురళీధర్ గౌడ్' ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఈ సినిమాలో మురళీధర్ SI పాత్ర చేస్తే, విజయ్ కానిస్టేబుల్ రోల్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో VD12లో విజయ్ పాత్ర ఏంటో బయటకి తెలిసిపోయింది.
అయితే ఇటీవల ఖుషి ఇంటర్వ్యూ సమయంలో విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ ఒక అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. మరి ఒక కానిస్టేబుల్ కి అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టార్స్ కి దర్శకుడు గౌతమ్ ఎలా లింక్ పెడతాడో చూడాలి. కాగా ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ మొదలయ్యి సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ ఆ నటిస్తుంది.
ఇక VD13 విషయానికి వస్తే.. ఇటీవలే ఫారిన్ లొకేషన్స్ చూసి వచ్చిన చిత్ర యూనిట్ త్వరలో అక్కడికి టేక్ ఆఫ్ అవ్వనున్నారు. దాదాపు నెలపాటు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ కి జోడిగా కనిపించనుంది. మరి డైరెక్టర్ పరశురామ్.. గీతగోవిందంలా ఈ చిత్రాన్ని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడా..? లేదా వేరే జోనర్ తో వస్తున్నాడా..? అనేది చూడాలి.
Next Story