Mon Dec 23 2024 05:53:01 GMT+0000 (Coordinated Universal Time)
యాక్టింగ్‌కి బ్రేక్ ఇచ్చి డైరెక్షన్ చేస్తా.. పోకిరి మూవీలో మాదిరి..!
విజయ్ దేవరకొండ యాక్టింగ్ బ్రేక్ ఇచ్చి డైరెక్షన్ చేయాలనుకుంటున్నాడట. అలాగే పోకిరి సినిమాలో..
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఖుషి (Kushi) సినిమాతో ఈ వారం పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న విజయ్.. సోషల్ మీడియా ద్వారా నేషనల్ వైడ్ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అయ్యాడు. ఇక ఈ ఇంటరాక్షన్‌లో ఖుషి సినిమాకి సంబంధించిన సంగతులతో పాటు తన పర్సనల్ అండ్ కెరీర్ విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఈక్రమంలోనే తనకి డైరెక్షన్ అంటే ఇంటరెస్ట్ అని తెలియజేశాడు.
కొంతకాలం యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి డైరెక్షన్ చేయాలనీ ఉందని, కానీ తన దగ్గరకి వచ్చిన కథలు విన్నాక నటించకుండా ఉండలేకపోతున్నాను అంటూ పేర్కొన్నాడు. అయితే తనకి నటించే ఓపిక ఉన్నంత వరకు యాక్టింగ్ చేసి, ఆ తరువాత దర్శకుడిగా తప్పకుండా సినిమాలు తీస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే బిజినెస్ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. బిజినెస్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే బిజినెస్ మెన్ గా పరిచయం అవుతానని చెప్పుకొచ్చాడు.
ఇక కెరీర్ లో ఇలాంటి పాత్రలో నటించాలని ఏమన్నా డ్రీం రోల్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా, దానికి బదులిస్తూ.. "అలా ఏమి అనుకోలేదు గాని, పోకిరి మూవీలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ నాకు చాలా ఇష్టం. అలాంటి ఎంట్రీ నాకు కూడా కావాలని డ్రీం ఉంది. ఏదైనా సినిమాలో కుదిరితే అలాంటి ఎంట్రీ పెట్టుకోవాలి" అంటూ తన డ్రీంని తెలియజేశాడు. అలాగే తనకి సోషియో ఫాంటసీ సినిమాలు అంటే ఇస్తామని అలాంటి కథ వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు.
కాగా విజయ్ ఖుషి తరువాత VD12, VD13 సినిమాలతో రాబోతున్నాడు. ఈ రెండు సినిమా కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అలాగే తమిళ దర్శకులు అరుణ్ ప్రభు, అరుణ్ మాతేశ్వరన్ లతో కథా చర్చలు జరుగుతున్నాయని, అవి ఒకే అయితే వరుసలో అవికూడా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక తనని అర్జున్ రెడ్డితో స్టార్ హీరోని చేసిన సందీప్ వంగతో కూడా మరో సినిమా ఉంటుందని వెల్లడించాడు.
Next Story