Mon Dec 23 2024 08:40:02 GMT+0000 (Coordinated Universal Time)
'ఖుషి' కి క్రేజ్ ఉంది.. మంచి డిమాండ్ కూడా
విజయ్ దేవరకొండ, సమంత నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి
విజయ్ దేవరకొండ, సమంత నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఖుషి'. ఈ సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. పాటలు సూపర్ హిట్ అవ్వడంతో ఊహించని హైప్‌ను దక్కించుకుంది ఈ సినిమా. నిన్ను కోరి, మజిలీ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఖుషి చుట్టూ ఉన్న విపరీతమైన క్రేజ్‌తో భారీ బిజినెస్ జరుగుతూ ఉంది. విజయ్ దేవరకొండ ఇంతకు ముందు నటించిన లైగర్ డిజాస్టర్ అవ్వగా.. సమంత లీడ్ లో చేసిన శాకుంతలం కూడా బొక్కబోర్లా పడింది. అయినా కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతూ ఉండడం ఎంతో ఆశ్చర్యంగా ఉందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.
పాటలు, ట్రైలర్ సినిమాపై చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం దక్షిణాది భాషలలోనూ, హిందీలోనూ విడుదల అవుతోంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను పెద్ద ధరకు విక్రయించారు. నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే నిర్మాతలు సినిమా బడ్జెట్‌ను దాదాపు రికవరీ చేశారు. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్‌తో ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 50కోట్ల వరకూ ఉండనుందని అంచనా..! మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడాకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ చిత్రం 'హృదయం' చిత్రానికి సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషి సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Next Story