Mon Dec 23 2024 11:28:27 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD : ప్రభాస్ 'కల్కి'లో విజయ్ దేవరకొండ.. నిజమేనా..!
ప్రభాస్ 'కల్కి'లో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నారట. ఒక అతిథి పాత్రలో..
Kalki 2898 AD : ఇండియాలోనే భారీ బడ్జెట్తో, భారీ స్టార్ కాస్ట్తో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి'. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ హాలీవుడ్ ఫ్యూచరిస్టిక్ మూవీస్ తరహాలో రూపొందుతుంది. సూపర్ హీరో సూట్స్, మోడరన్ గాడ్జెట్స్, వెపన్స్తో.. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీలో దీపికా పదుకోన్, దిశా పటాని ఫీమేల్ లీడ్ చేస్తుంటే అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రని చేస్తున్నారు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నారు.
అయితే ఈ మూవీలో వీరితో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ కూడా కనిపించబోతుందని నిర్మాత అశ్వనీదత్ ముందు నుంచి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కనిపించబోయే.. ఆ ఇతర స్టార్ ఎవరో అనే వార్త ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఓ అతిథి పాత్ర చేస్తున్నారట. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన గత సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటిలో విజయ్ నటించిన సంగతి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ నిర్మించిన జాతిరత్నాలులో కూడా విజయ్ అతిథి పాత్ర చేశారు.
నాగ్ అశ్విన్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పటి నుంచి విజయ్ తో మంచి స్నేహం ఉంది. ఆ ఫ్రెండ్షిప్ తోనే ఇప్పటి వరకు తాను తెరకెక్కించిన సినిమాలు అన్నిటిలో విజయ్ కి ఓ పాత్ర రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కల్కిలో కూడా అలాగే ఓ పాత్ర సృష్టించారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. విజయ్ తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే. కాగా ఈ సినిమా మే 9న రిలీజ్ కాబోతుంది.
Next Story