Mon Dec 23 2024 02:51:07 GMT+0000 (Coordinated Universal Time)
నగ్నంగా విజయ్ దేవరకొండ
అందులో న్యూడ్ గా కనిపించాడు. కేవలం ఒక పూల బొకేను మాత్రం అడ్డు పెట్టుకున్నాడు.
విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్స్ మామూలుగా ఉండవు. ఇక కంటెంట్ ఉన్న సినిమా అంటే.. మనోడు ప్రమోషన్స్ కే ఫుల్ టైమ్ కేటాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజి ఆడియన్స్ కు దగ్గరవ్వాలని భావిస్తూ ఉన్నాడు. తాజాగా లైగర్ కోసం ఏకంగా న్యూడ్ పోస్టర్ ను విడుదల చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అనన్య పాండే, మైక్ టైసన్‌తో కలిసి నటిస్తున్న చిత్రం లైగర్. తాజాగా సినిమా కోసం పోస్టర్ ను విడుదల చేశారు. అందులో న్యూడ్ గా కనిపించాడు. కేవలం ఒక పూల బొకేను మాత్రం అడ్డు పెట్టుకున్నాడు.
ఈ ఫోటోలో, 'సాలా క్రాస్‌బ్రీడ్' అని రాసి ఉంది. ఈ నగ్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోను నిర్మాత కూడా అయిన కరణ్ జోహార్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్గా నటిస్తోంది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు నెలలకు ముందే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది.
Next Story