Mon Dec 23 2024 02:02:48 GMT+0000 (Coordinated Universal Time)
Vijay - Rashmika : ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం..?
ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం జరగబోతుందా..? నేషనల్ మీడియాలో సైతం..
Vijay Deverakonda - Rashmika Mandanna : టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ కథ.. ఆడియన్స్ నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు ట్రెండింగ్ టాపిక్ అయ్యిపోతుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది ప్రేమా..? స్నేహమా..? అనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే ప్రేమ కాదు అంటూనే విజయ్ అండ్ రష్మిక.. చాలా సన్నిహితంగా కనిపిస్తూ వస్తున్నారు.
దీంతో వీరిద్దరి ప్రేమ, పెళ్లి పై అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా టాలీవుడ్ మీడియాలో కాదు. నేషనల్ మీడియాలోనే వీరిద్దరి పెళ్లి వార్త గురించి వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్ళి గురించి రెండు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చేశాయట. ఈ ఏడాదిలో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతుందని తెలుస్తుంది. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తలు నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే. కాగా రష్మికకు ఆల్రెడీ గతంలో ఒకసారి నిశ్చితార్థం అయ్యింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక అతనితో 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ అది కొన్ని కారణాలు వల్ల బ్రేక్ అయ్యింది. దీంతో ఆ ప్రేమ కథ అక్కడితో ముగిసిపోయింది. ఆ తరువాత గీతగోవిందంతో విజయ్ ప్రేమ కథ మొదలయింది.
కాగా ప్రస్తుతం విజయ్ అండ్ రష్మిక కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉన్నారు. యానిమల్, పుష్ప సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న రష్మిక.. ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఆమె పెళ్లి చేసుకుంటున్నారా అనేది కూడా సందేహం కలిగిస్తుంది. ప్రెజెంట్ రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
Next Story