Mon Dec 23 2024 06:30:11 GMT+0000 (Coordinated Universal Time)
Hi Nanna : విజయ్-రష్మిక ఫోటోని మరింత చీప్‌గా వాడుకుంటారా.. నానిపై ఫ్యాన్స్ ఫైర్..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫోటోని మీ ప్రమోషన్స్ కోసం మరింత చీప్‌గా వాడుకుంటారా అంటూ 'హాయ్ నాన్న' మూవీ టీంపై..
Hi Nanna : నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా 'హాయ్ నాన్న' రిలీజ్ కి సిద్దమవుతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా శృతిహాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని నాని అండ్ హాయ్ నాన్న టీం ఓ రేంజ్ లో చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫొటోలతో హాయ్ నాన్న టీం చేసిన పని విజయ్, రష్మిక అభిమానులకు కోపం తెప్పిస్తుంది. అసలు ఏమైందంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్క్రీన్ పై కొన్ని ఫోటోలు ప్లే చేస్తూ.. ఆ పిక్ మీద మీ కామెంట్స్ ఏంటని నాని అండ్ మృణాల్ ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈక్రమంలోనే విజయ్, రష్మిక పిక్స్ ని కూడా ప్లే చేశారు. ఆ ఫోటోలు విజయ్ అండ్ రష్మిక మాల్దీవ్ వెకేషన్ కి సంబంధించిన పిక్స్.
గతంలో ఆ పిక్స్ మీద సోషల్ మీడియాలో లవ్ రూమర్స్ కూడా నడిచాయి. విజయ్, రష్మిక ఇద్దరు కలిసే మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఆ రూమర్స్ అన్ని నెటిజెన్స్ కామెంట్స్, మీడియా ఆర్టికల్స్ వరుకే ఉండేవి. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన నాని.. తన సినిమా ఫంక్షన్లో, తన సహా నటీనటులకు సంబంధించిన ఒక రూమర్ ని ఇలా ప్లే చేయడం చర్చినీయాంశంగా మారింది.
ఈ విషయం గురించి నెటిజెన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు.. 'ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇలా అంటున్నారంటే, విజయ్ అండ్ రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారు అనుకుంటా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్-రష్మిక ఫ్యాన్స్ ఇలా అంటున్నారు.. 'ప్రమోషన్స్ కోసం మరింత చీప్‌గా ప్రవర్తిస్తారా..?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story