Mon Dec 23 2024 08:46:45 GMT+0000 (Coordinated Universal Time)
Vijay - Rashmika : మొన్న నాని, నేడు నితిన్.. విజయ్-రష్మిక లవ్‌స్టోరీ..!
ప్రస్తుతం విజయ్-రష్మిక లవ్‌స్టోరీ రూమర్‌ని ఆడియన్స్ కంటే హీరోలే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. బాలయ్య, నాని, నితిన్..
Vijay Deverakonda - Rashmika Mandanna : టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ కథ.. ఆడియన్స్ నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు ట్రెండింగ్ టాపిక్ అయ్యిపోతుంది. విజయ్ అండ్ రష్మిక.. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే ప్రేమ కాదు అంటూనే చాలా సన్నిహితంగా కనిపిస్తారు. మొన్నటి వరకు సోషల్ మీడియా వరుకే ఉండే ప్రేమ రూమర్లు, ఇప్పుడు ఇండస్ట్రీలోని హీరోలు కూడా మాట్లాడుతుంటే.. వీరిద్దరి లవ్ స్టోరీ నిజమేనా అనిపిస్తుంది.
ఇటీవల 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి సంబంధించిన మాల్దీవ్ వెకేషన్ పిక్స్ ని స్క్రీన్ పై ప్లే చేసి.. వాటిపై నాని, మృణాల్ కామెంట్స్ అడగడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఈ విషయం గురించి విజయ్, రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవ్వగా.. నాని కూడా క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు తాజాగా హీరో నితిన్ తన కొత్త సినిమాలో విజయ్, రష్మిక లవ్ స్టోరీ గురించి మాట్లాడే సీన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమాలో నటించారు. నేడు ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక ఈ సినిమాలోని ఓ సీన్ లో నితిన్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆ నితిన్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడని తెలుసుకొని.. హీరోయిన్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా సినిమా హీరోల గురించి ప్రశ్నలు వేస్తారు. బాలయ్య తన ఫ్యాన్స్ ని కొడతారంటగా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఎప్పుడు.. ఇలా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నితిన్ సరదా సమాధానాలు ఇస్తూ వస్తుంటారు.
ఈక్రమంలోనే విజయ్, రష్మిక మధ్య ఏముందని అడుగుతారు. దానికి నితిన్ బదులిస్తూ.. అల్లు అర్జున్ జులాయి మూవీలోని "నాను ఎట్టగుంటే నీకెంటన్నాయ్.. నానేటి సేతే నీకెంటన్నాయ్" అనే పాటని పాడి బదులిస్తాడు. అక్కడ నితిన్ అర్ధం ఏంటంటే.. 'ఎవరు ఏం చేస్తే మీకెందుకు' అని ప్రశ్నించారు. ఇప్పుడు నితిన్ ఇచ్చిన ఈ సమాధానం కూడా విజయ్-రష్మిక లవ్‌స్టోరీ నిజమేనా.. అనే సందేహాన్ని కలిగిస్తుంది.
మొన్న అన్‌స్టాపబుల్ షోలో కూడా బాలయ్య.. విజయ్ గురించి రష్మిక ముందు నొక్కి మాట్లాడడం, రణబీర్ కపూర్ కూడా వారిద్దరి రిలేషన్ గురించి ప్రత్యేకంగా ప్రశ్నించడం, ఇప్పుడు నాని, నితిన్ అదే ప్రేమ రూమర్ ని ప్రమోట్ చేయడం. ప్రస్తుతం ఈ రూమర్ ని ఆడియన్స్ కంటే సెలబ్రిటీసే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఇందువల్లే విజయ్-రష్మిక లవ్‌స్టోరీ నిజమేనా..? అనే సందేహం మరింత బలపడుతుంది.
Next Story