Mon Dec 23 2024 08:44:49 GMT+0000 (Coordinated Universal Time)
Vijay - Rashmika : ఇన్స్టా స్టోరీలో విజయ్, రష్మిక లవ్లీ చాటింగ్..
ఇన్స్టా స్టోరీలో విజయ్ దేవరకొండ, రష్మిక లవ్లీ చాటింగ్. నీ కోసం వారిని నేను తీసుకువస్తానంటూ..
Vijay Deverakonda - Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒకరికి ఒకరు లవ్లీ చాటింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీన్షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ 'రౌడీ' బ్రాండ్ పేరుతో బట్టలు బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ బిజినెస్ ప్రమోషన్ కోసం టాలీవుడ్ సింగర్ రామ్ మిరియాలతో ఒక పాట పాడించారు.
గతంలో రామ్ మిరియాల పాడిన 'అలయ్ బలయ్' పాటనే తన బ్రాండ్ ప్రమోషన్ కి తగ్గట్లు విజయ్ పాడించుకున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ సాంగ్ ని రష్మిక తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. "ఇలాంటి ఐడియాలు నీకు(విజయ్) ఎలా వస్తాయి అబ్బా. ఇది చాలా బాగుంది. ఎప్పటినుంచో నేను నే ప్లే లిస్టుని అడుగుతున్నాను. ఇప్పుడు మొత్తం అందరూ అది చూస్తున్నారు. బలే వైబ్ ఉంటుంది నీ ప్లే లిస్టులో. నా ఫేవరెట్ ఆర్టిస్ట్ సాంగ్స్ ని కూడా పంపిస్తాను. నాకోసం కూడా ఆ సాంగ్స్ ని రామ్ మిరియాలతో పాడించి" అంటూ పేర్కొన్నారు.
ఇక ఈ స్టోరీకి విజయ్ రియాక్ట్ అవుతూ.. "నా ప్లే లిస్టు పై నీకు చాలా ప్రేమ ఎక్కువ అయ్యింది. సరే నీకు ఇష్టమైన ముగ్గురు ఆర్టిస్ట్ ప్లే లిస్ట్ పంపించు.. నీ కోసం వారితో నేను పాడిస్తాను" అంటూ పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకి రష్మిక రియాక్ట్ అవుతూ.." ఆ ఆర్టిస్ట్ లిస్టుని ఇప్పుడే పంపిస్తున్నాను" అంటూ రష్మిక పోస్ట్ పెట్టారు. ఈ లవ్లీ చాటింగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సోషల్ ప్లాట్ఫార్మ్ లో విజయ్, రష్మిక ఇలా చాట్ చేసుకోవడంతో.. వీరిద్దరి ప్రేమ వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Next Story