Mon Dec 23 2024 11:25:28 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ దేవరకొండ ఉన్న ప్లేస్.. తన గమ్యం అంటున్న రష్మిక..
విజయ్ దేవరకొండ ఫొటోలో ఉన్న లొకేషన్ తన గమ్యం అంటున్న రష్మిక.
రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా అది కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. ఇక ఈ అమ్మడు ఒక పోస్టు షేర్ చేయగానే.. దానికి విజయ్ దేవరకొండ పోస్టులకి ఏమన్నా పోలిక ఉందా అని నెటిజెన్స్ వెతకడం మొదలు పెట్టేస్తారు. ఏదో రకంగా రష్మిక, విజయ్ పోస్టులు మధ్య ఒక పోలిక కనిపెట్టి నెట్టింట వైరల్ చేస్తేస్తారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారు. కానీ బయటకి చెప్పకుండా సీక్రెట్ గా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తుంటారు.
కాగా రీసెంట్ గా రష్మిక తన ఓల్డ్ వెకేషన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటో అండ్ వీడియో షేర్ చేసింది. "ఫోటోలో ఉన్న లొకేషన్ నా గమ్యం. వీడియోలో ఆ గమ్యాన్ని వెతుకుంటూ వెళ్తున్నా. వెకేషన్ డేస్ ని మిస్ అవుతున్నా" అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్.. ఇంకేముంది వెంటనే విజయ్ ఓల్డ్ ఫోటోలు సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు. ఫైనల్గా కొన్ని ఫోటోలను కనిపెట్టారు. రష్మిక షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న లొకేషన్, గతంలో విజయ్ షేర్ చేసిన తన ఫొటోలో లొకేషన్ సేమ్ ఉంది.
ఫోటో మాత్రమే కాదు వీడియోలో కనిపిస్తున్న లొకేషన్ ని కూడా విజయ్ ఫొటోల్లో కనిపెట్టేశారు. ఇంకేముంది.. ఆ టైములో ఇద్దరు కలిసే లవ్ వెకేషన్ కి వెళ్లారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీమర్స్ ప్రత్యేక పోస్టులు వేస్తూ మీమ్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రష్మిక, విజయ్ ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మరి ఆ ఫోటో, వీడియోలు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
కాగా ఇటీవల విజయ్ దేవరకొండ VD12 మూవీలో.. హీరోయిన్ గా ఎంపికైన శ్రీలీల తప్పుకుందని, ఆమె స్థానంలోకి రష్మిక వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఎటువంటి నిజం లేదని నిర్మాతలు తెలియజేశాడు. దీంతో ఈ ఇద్దరి కామన్ అభిమానులు కొంత నిరాశ చెందారు. రష్మిక ప్రస్తుతం యానిమల్, పుష్ప 2 వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది.
Next Story