Mon Dec 15 2025 00:15:50 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ సెట్స్‌లో మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టేవాడు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ కు లైగర్‌లో మైక్ టైసన్‌తో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి

విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఆగస్ట్ 25.. గురువారం నాడు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కనిపించాడు. పాత్ర చిన్నదైనప్పటికీ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్ అని చెప్పుకునే మైక్ టైసన్ మొదటిసారి ఇండియన్ సినిమాలో కనిపించడం విశేషం. మైక్ టైసన్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు తనని తిట్టేవాడని విజయ్ దేవరకొండ వెల్లడించాడు. అయితే అది సరదాగా అని చెప్పుకొచ్చాడు. లీగర్ సినిమా స్పోర్ట్స్ డ్రామా.. పూరి జగన్నాధ్ రచన, దర్శకత్వం వహించాడు. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రమైన లైగర్ ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ అరంగేట్రం చేశాడు.
విజయ్ దేవరకొండ కు లైగర్‌లో మైక్ టైసన్‌తో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సినిమాలో మంచి బాడీ కోసం విజయ్ దేవర కొండ.. దాదాపు రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నాడు. సినిమా సెట్స్‌లో దిగ్గజ బాక్సర్ తనను సరదాగా తిట్టేవాడని ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ వెల్లడించాడు. "మైక్ టైసన్ నన్ను చాలా ప్రేమగా, ఇంగ్లీష్‌లో తిట్టేవాడు. అతను నాతో చెప్పినదాన్ని ఇక్కడ చెప్పలేను. అయితే నేను అతనితో మంచి సమయాన్ని గడిపాను" అని మీడియాతో చెప్పాడు విజయ్ దేవర కొండ. ఇక మైక్ టైసన్‌కి భారతీయ ఆహారం, సంగీతం అంటే చాలా ఇష్టం అని విజయ్ దేవరకొండ తెలిపాడు. అయితే ఇక్కడి జనాలను చూసి మైక్ టైసన్ భయపడతాడని చెప్పుకొచ్చాడు. షూటింగ్ సమయంలో మైక్ టైసన్ భారతీయ ఆహారాన్ని తీసుకురావాలని మమ్మల్ని అడిగేవాడు. భారతీయ వంటకాల పేర్లు చెప్పి మరీ తీసుకుని రమ్మని అడిగేవాడని విజయ్ దేవరకొండ తెలిపాడు.
లైగర్ సినిమా స్పోర్ట్స్ డ్రామా, ఇందులో విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ పాత్రలో నటించాడు. అనన్య పాండే, ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
News Summary - Vijay Deverakonda reveals Mike Tyson abused him on the sets of Liger
Next Story

