Mon Dec 23 2024 04:48:54 GMT+0000 (Coordinated Universal Time)
Vijay - Mrunal : కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న విజయ్, విశ్వక్, మృణాల్..
విజయ్ దేవరకొండ శ్రీకారం చుట్టిన ట్రెండ్ ని విశ్వక్ సేన్, మృణాల్ ఠాకూర్ కొనసాగిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నారు.
Vijay Deverakonda - Mrunal Thakur : సోషల్ మీడియా యూసేజ్ పెరిగిన దగ్గర నుంచి.. రోజుకో ట్రెండ్ మొదలవుతుంది. ఈక్రమంలోనే టాలీవుడ్ లో కొత్తగా ఓ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఈ ట్రెండ్ కి విజయ్ దేవరకొండ శ్రీకారం చుడితే.. విశ్వక్ సేన్ (Vishwak Sen), మృణాల్ ఠాకూర్ కొనసాగిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇంతకీ ఆ కొత్త ట్రెండ్ ఏంటని ఆలోచిస్తున్నారా..!
ఆ ట్రెండ్ ఏంటంటే, ఇటీవల విజయ్ దేవరకొండ లేడీ ఫ్యాన్స్ ఒక వీడియోని పోస్టు చేస్తూ.. "ఈ వీడియో పై విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తే మేము మా పరీక్షలకు ప్రిపేర్ అవుతాము" అని పేర్కొన్నారు. ఇక ఆ వీడియోకి విజయ్ రియాక్ట్ అవుతూ.. "మీరు 90 శాతం మార్కులు తెచ్చుకుంటే మిమ్మల్ని నేనే కలుస్తాను" అంటూ కామెంట్ చేసారు. ఇక ఆ కామెంట్, ఆ వీడియో కాస్త ట్రెండ్ కి దారి తీసింది.
అదే నేపథ్యంతో ఓ తెలుగు మీమర్.. "విశ్వక్ సేన్ ఈ మీమ్ మీద కామెంట్ చేస్తే నేను నా కెరీర్ మీద ఫోకస్ చేస్తాను" అంటూ మీమ్ వేసాడు. దానికి విశ్వక్ రియాక్ట్ అవుతూ.. "ఏముందిలే ఇంక పడుకో. పొద్దునే ఆలోచిద్దాం కెరీర్ గురించి" అంటూ కామెంట్ చేసాడు. దీంతో ఈ ట్రెండ్ కి మరింత క్రేజ్ వచ్చింది. ఇక మీమర్స్ అంత రకరకాల మీమ్స్ తో సందడి చేస్తున్నారు.
ఈ ట్రెండ్ ని గమనించిన జెమినీ టీవీ 'హాయ్ నాన్న' మూవీ టెలికాస్ట్ డేట్ గురించి మాట్లాడుతూ మృణాల్ వీడియో షేర్ చేస్తూ.. "ఈ వీడియో పై మృణాల్ కామెంట్ చేస్తే హాయ్ నాన్న టెలికాస్ట్ డేట్ చెబుతాము" అంటూ పేర్కొంది. ఇక ఆ వీడియోకి మృణాల్ రియాక్ట్ అవుతూ.. "అప్డేట్ ఇవ్వండి ప్లీజ్" అంటూ కామెంట్ చేసింది. దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Next Story