విజయ్ టాలీవుడ్ రణ్వీర్ సింగ్
విజయ్ దేవరకొండ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు టాలీవుడ్ లో. తన ఇమేజ్ తగ్గట్టు సినిమాలు తీసే విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో [more]
విజయ్ దేవరకొండ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు టాలీవుడ్ లో. తన ఇమేజ్ తగ్గట్టు సినిమాలు తీసే విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో [more]
విజయ్ దేవరకొండ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు టాలీవుడ్ లో. తన ఇమేజ్ తగ్గట్టు సినిమాలు తీసే విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇందులో విజయ్ చాలా కొత్తగా ఫుల్ గడ్డంతో, ఫుల్ హెయిర్ తో, చెదిరిపోయిన క్రాఫ్ తో ఏదో ప్రేమను కోల్పోయినోడిలా ఆ లుక్ రిలీజ్ చేసారు.
ఇదేంటి విజయ్ ఇలా….
ఇది పక్కన పెడితే నిన్న విజయ్ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కొరకు విచ్చేశాడు. ఓపెనింగ్ కు వచ్చిన విజయ్ ని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. గతానికి భిన్నంగా ఆయన ట్రిమ్డ్ షేవ్, డిఫరెంట్ గా రౌండ్ గాగుల్స్ ధరించి కొత్తగా కనిపించారు. సినిమా కోసం ఏడాది పైగా గడ్డం పెంచుకున్న విజయ్ ఒక్కసారిగా ఫుల్ షేవ్ తో కనిపించేపాటికి తన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. క్రాంతి మాధవ్ సినిమాలో ఫుల్ షేవ్ తో నటించాల్సి ఉందో ఏమో? అందుకే ఇలా కనిపిస్తున్నాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. పైగా విజయ్ వేసిన డ్రెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. క్రాంతి మాధవ్ తరువాత విజయ్ పూరి తో ఓ సినిమా చేయనున్నాడు.