Thu Dec 19 2024 12:33:20 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ హీరో భార్య హఠాన్మరణం
స్పందన తన కుటుంబంతో థాయ్‌లాండ్‌లో విహారయాత్రలో ఉన్న సమయంలో
ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఈ మధ్య గుండెపోట్లు వస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఎంతో మంది ప్రముఖులు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోయారు. కన్నడ చిత్ర పరిశ్రమ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను కూడా అలాగే కోల్పోయింది. ఇప్పుడు ప్రముఖ హీరో భార్య కన్నుమూయడం ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది.
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య కన్నుమూశారు. 45 ఏళ్ల స్పందన బ్యాంకాక్‌లోని ఆసుపత్రిలో మరణించింది. గుండెపోటుతో మరణించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, స్పందన తన కుటుంబంతో థాయ్‌లాండ్‌లో విహారయాత్రలో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చింది. లో బీపీ కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. నటుడి భార్య మృతదేహం మంగళవారం బెంగళూరుకు రానున్నట్లు సమాచారం.
స్పందన రిటైర్డ్ పోలీసు అధికారి బికె శివరామ్ కుమార్తె. 2007లో రాఘవేంద్రతో వివాహం జరిగింది. రాఘవేంద్ర సోదరుడు స్టార్ హీరో శ్రీ మురళి కూడా ఆమె మరణాన్ని ధృవీకరించారు. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లిన ఆమె ఎప్పటిలాగే నిద్రపోయిందని.. కానీ ఆమె ఆ తర్వాత నిద్ర లేవలేదని అన్నారు. రాఘవేంద్ర బ్యాంకాక్‌లో ఉన్నారని మురళి చెప్పుకొచ్చారు. స్పందన సోమవారం భారతదేశానికి తిరిగి రావాల్సి ఉండగా.. ఇంతలోనే ఆమె మరణించారనే వార్తను వినాల్సి వచ్చింది. స్పందన మృతి చెందారనే వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సోమవారం బెంగళూరులో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది.
Next Story