విజయ్ కి ఆ రేంజ్ ఉందా..!
దీపావళి సందర్భంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విజయ్ - మురుగదాస్ సర్కార్ మీద భారీ అంచనాలు తమిళనాడుతో పాటు తెలుగులోనూ ఉంది. విజయ్ - మురుగదాస్ కాంబో అంటే అదో సెన్సేషన్. ఆ కాంబో మీద విపరీతమైన క్రేజ్ ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్న సర్కార్ వరల్డ్ వైడ్ గా నవంబర్ 6న విడుదలవుతుంది. మురుగదాస్ డైరెక్టర్ అనగానే తెలుగు ప్రేక్షకులకు మంచి ఇంట్రెస్ట్ కలగడం... విజయ్ గత రెండు మూడు సినిమాల నుండి తెలుగులో మార్కెట్ పెంచుకోవడం, విజయ్ సూపర్ హిట్ మూవీస్ తెలుగులో రీమేక్ అవడం వంటి వాటితో సర్కార్ మీద క్రేజీ అంచనాలు వచ్చేశాయి.
ఇక్కడే ఎక్కువ థియేటర్లలో...
ఇక తమిళనాట కన్నాఎక్కువగా తెలుగులోనే అధిక థియేటర్స్ లో సర్కార్ విడుదలవుతుంది. తమిళనాట ఎంత భారీగా విడుదల చేసినా.. అక్కడ థియేటర్స్ చాలా తక్కువ.. కేవలం 600 నుండి 650 థియేటర్స్ లో సర్కార్ తమిళనాడులో విడుదలవుతుంది. ఇక తెలుగులో అత్యధికంగా 750 థియేటర్స్ పైనే విడుదలవుతుంది. అయితే నవాబ్ ని తెలుగులో విడుదల చేసిన ప్రొడ్యూసర్ అశోక్ వల్లభనేని సర్కార్ ని తెలుగులో విడుదల చేస్తున్నాడు. సర్కార్ తెలుగు డబ్బింగ్ హక్కులను అశోక్ వల్లభనేని 7 కోట్లకి దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయ్యింది.
దీపావళికి పెద్ద సినిమా లేకపోవడంతో...
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ కి బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాలి. మరి విజయ్ కి ఎంతగా క్రేజ్, మార్కెట్ పెరిగినా.. ఈ 7.5 కోట్లు రాబట్టడం అంత తేలికైన పనికాదు. కాకపోతే తెలుగులో విజయ్ సర్కార్ కి పోటీగా పెద్ద సినిమా ఏమీ ఈ దీపావళికి విడుదల కాకపోవడమే విజయ్ సర్కార్ కి కలిసొచ్చే అంశం. అలాగే సర్కార్ కి ఇచ్చిన అధిక థియేటర్స్ తో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా విజయ్ మార్కెట్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ 7.5 కోట్లు కాస్త ఎక్కువే. మరి చూద్దాం తెలుగులో విజయ్ క్రేజ్ ఈ సర్కార్ తో ఏ మాత్రం బయటికొస్తుందో అనేది.