Sat Dec 21 2024 14:11:03 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఫోటోలో ఉన్నది విజయ్ సేతుపతి అంటే.. నమ్ముతారా ?
ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాలు.. తెలుగులోకి డబ్ అవుతున్నాయి. అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ..
వర్సెటైల్ యాక్టర్ గా తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఫ్యాన్స్ ను సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ స్పీడుమీదున్నాడు విజయ్ సేతుపతి. కాగా.. ఆయనకు తెలుగులో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా విజయ్ సేతుపతికి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా. దీని తర్వాత కమల్ హాసన్ చేసిన విక్రమ్ లో, ఉప్పెన కంటే ముందొచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించి అలరించాడు. కానీ ఆ రెండూ తెలుగులోకి డబ్ చేసిన సినిమాలే.
ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాలు.. తెలుగులోకి డబ్ అవుతున్నాయి. అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ.. విజయ్ సేతుపతి కాస్త బరువు తగ్గితే.. ఇంకా బాగుంటారని అనుకున్నారు. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన.. ఎవరూ ఊహించని రీతిలో కొత్తలుక్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. స్లిమ్గా మారిన విజయ్ సేతుపతిని చూసి అవాక్కవుతున్నారు. అసలు ఆయన అంతకుముందు చూసిన విజయ్ సేతుపతి యేనా అని ఒకటికి వందసార్లు ఆ ఫోటోలను చూస్తున్నారు.
Next Story