విజయ్ కి తప్పని తిప్పలు?
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయాడు. అంతకుముందు పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టినా విజయ్ దేవరకొండ కి= అంతగా [more]
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయాడు. అంతకుముందు పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టినా విజయ్ దేవరకొండ కి= అంతగా [more]
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయాడు. అంతకుముందు పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టినా విజయ్ దేవరకొండ కి= అంతగా క్రేజ్ రాలేదు. అర్జున్ రెడ్డి తో స్టార్ అవతారమెత్తిన విజయ్ దేవరకొండ ని గీత గోవిందం మరింత క్రేజ్ పెంచేలా చేసింది. దానితో విజయ్ దేవరకొండ తో పని చెయ్యాలని తహతహలాడే దర్శకనిర్మాతలు ఎక్కువపోయారు. అలాగే విజయ్ దేవరకొండ కి స్టైలిస్ట్ గా ఉండాలని.. డ్రెస్ డిజైన్ చెయ్యాలని చాలామంది స్టైలిస్ట్ లు, డిజైనర్స్ పోటీ పడుతున్నారు. కానీ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చేయకముందు ఓ బాలీవుడ్ డిజైనర్ విజయ్ దేవరకొండ కి డ్రెస్ డిజైన్ చెయ్యడానికి ఇష్టపడలేదట.
అర్జున్ రెడ్డి కి ముందు పెద్ద పెద్ద డిజైనర్లు ఎవరూ విజయ్ దేవరకొండ కి దుస్తులు డిజైన్ చేసేందుకు ఇష్టపడలేదని.. ప్రస్తుతం విజయ్ కి స్టైలిస్ట్ గా చేస్తున్న స్టైలిస్ట్ చెబుతున్నాడు. అప్ప్పుడు విజయ్ కి దుస్తులు ఇవ్వలేం అని చెప్పినప్పుడు షాకయ్యా అంటున్నాడు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ కి దుస్తులు డిజైన్ చేసేందుకు మేము రెడీ అంటూ చాలామంది పెద్ద పెద్ద డిజైనర్స్ పోటిపడుతున్నారని చెబుతున్నాడు విజయ్ స్టైలిస్ట్. గతంలో విజయ్ తో పని చేసేందుకు ఆశక్తి చూపని డిజైనర్లు ఇప్పుడు అయన స్టార్ హీరో అయ్యాక ఆయనతో పని చేసేందుకు మమ్మల్నే వచ్చి అడుగుతున్నారంటూ.. విజయ్ దేవరకొండ స్టార్ హీరో కాకముందు పడిన ఇబ్బందుల గురించి చెబుతున్నాడు.