Sun Dec 22 2024 22:07:53 GMT+0000 (Coordinated Universal Time)
"వారసుడు" మూడురోజుల వసూళ్లు..
తెలుగులో ఇద్దరు అగ్రహీరోల సినిమాలైన..'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' వంటి భారీ సినిమాలకు పోటీగా విడుదలైన..
విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'వరిసు'.. తెలుగులో 'వారసుడు' టైటిల్ తో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. వారసుడు విడుదలయ్యాక తెలుగు రాష్ట్రాల్లో తొలి 3 రోజుల్లో.. రూ.8.9 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే 3.61 కోట్లను రాబట్టింది.
తెలుగులో ఇద్దరు అగ్రహీరోల సినిమాలైన..'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' వంటి భారీ సినిమాలకు పోటీగా విడుదలైన వారసుడు మూడు రోజుల్లో.. రూ.8.9 కోట్ల షేర్ ను సాధించడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టయినర్ నేపథ్యంలో రూపొందిప్పటికీ, యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యత ఉంది. తమిళంలో రూపొంది.. తెలుగులోకి అనువదించినా.. తారాగణాన్ని చూస్తే.. పక్కా తెలుగు సినిమానే అనిపిస్తుంది. కథ, కథనాలు తెలుగువారికి రొటీన్ గానే అనిపించాయనడంలో సందేహం లేదు. తమన్ సంగీతం ఈ సినిమాను కొంతవరకూ ఆదుకుంది.
Next Story