Mon Dec 23 2024 03:28:52 GMT+0000 (Coordinated Universal Time)
వెనక్కి తగ్గిన "వారసుడు".. సంక్రాంతి సినిమాలపై దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్
చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు సైతం విమర్శలు చేస్తుండటంతో.. దిల్ రాజు వారసుడిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అయితే.. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వారసుడు కూడా సంక్రాంతి బరిలో ఉంది. చిరంజీవి, బాలయ్య సినిమాలకంటే ముందే.. "వారసుడు"ను జనవరి 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. వారసుడు విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
టాలీవుడ్ కు చెందిన ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్న తరుణంలో విజయ్ సినిమాను విడుదల చేస్తుండటంపై టాలీవుడ్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు సైతం విమర్శలు చేస్తుండటంతో.. దిల్ రాజు వారసుడిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ్ వర్షన్ మాత్రం యథావిధిగా 11న విడుదల అవుతుందని, తెలుగులో 14న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. థియేటర్లకు పోటీ ఉండకూడదు.. ఏ నిర్మాతలు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే తాను వెనక్కి తగ్గినట్లు చెప్పారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా.. అందరూ తనపై పడి ఏడుస్తున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
Next Story