Mon Dec 23 2024 05:36:33 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్-రాజమౌళి మూవీలో హాలీవుడ్ యాక్టర్స్.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్..!
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారా..? సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్..
RRR తరువాత దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించబోతున్న సినిమా SSMB29. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించబోతున్న ఈ మూవీ పై ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో జక్కన్న కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని తెరకెక్కించబోతున్నాడు. ఇందుకోసం హాలీవుడ్ సంస్థలతో కూడా ఒప్పుందం కుదుర్చుకున్నాడు.
ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథ ఉండబోతుంది అంటూ ఇప్పటికే రాజమౌళి, సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా గురించి ఏదొక రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఒక రూమర్ గురించి విజయేంద్ర ప్రసాద్ ని ప్రశ్నించగా.. దానికి ఆయన ఇచ్చిన జవాబు అందర్నీ ఫుల్ ఖుషీ చేస్తుంది. ఇంతకీ ఆ రూమర్ ఏంటి..? ఆ జవాబు ఏంటి..?
SSMB29లో మహేష్ తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండబోతున్నారని ఒక రూమర్ నెట్టింట ఎప్పటినుంచో వినిపిస్తుంది. ఇక దీనికి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన జవాబు ఏంటంటే.. "ప్రస్తుతానికి ఇంకా ఎవర్ని సంప్రదించలేదు గాని, ఆ ఆలోచన అయితే ఉంది. ఆఫ్రికాలో సాగే అడ్వెంచర్స్ మూవీ కాబట్టి హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా సినిమాలో చూడవచ్చు" అంటూ చెప్పుకొచ్చారు. ఇక కామెంట్స్ తో మూవీ పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.
ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. ఆ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు జరగనుంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు మొత్తం పూర్తి అయిన తరువాతే మహేష్, రాజమౌళి సినిమాలోకి అడుగుపెట్టనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ మూవీ పనులు మొదలుకావొచ్చు అని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో రాజమౌళి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
Next Story