Mon Dec 23 2024 01:43:48 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : కేజీఎఫ్ కోసం వైకింగ్స్.. సలార్ కోసం గేమ్ ఆఫ్ థ్రోన్స్.. ఏంటి నీల్ బ్రో..
కేజీఎఫ్ కోసం 'వైకింగ్స్'ని, సలార్ కోసం 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'ని ప్రశాంత్ నీల్ కాపీ కొట్టారా..?
Salaar : ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని సరిగా గమనిస్తే.. వరల్డ్స్ టాప్ రేటెడ్ వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' గుర్తుకు వస్తుంది. ఇది మాత్రమే కాదు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన క్రిందటి మూవీ కేజీఎఫ్ కూడా ఒక టాప్ వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది. వైకింగ్స్ వెబ్ సిరీస్ షేడ్స్ కేజీఎఫ్ లో కనిపిస్తాయి.
ముందుగా కేజీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. కేజీఎఫ్ సినిమా కథంతా బంగారం చుట్టూనే తిరుగుతుంది. ఇక వైకింగ్స్ కథ కూడా బంగారం దోచుకోవడం అనే లైన్ చుట్టూనే తిరుగుతుంది. కేజీఎఫ్ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర వేషధారణ వైకింగ్స్ లోని మెయిన్ క్యారెక్టర్ 'రాగ్నార్ లోత్‌బ్రోక్' గెటప్ లా కనిపిస్తుంది.
సంజయ్ దత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు, రాగ్నార్ లుక్ చూపిస్తూ ట్రోల్స్ కూడా చేశారు. దానికి ప్రశాంత్ నీల్ కూడా వివరణ ఇచ్చారు. తనకి వైకింగ్స్ లోని రాగ్నార్ పాత్ర అంటే చాలా ఇష్టమని. అందుకే సంజయ్ దత్‌ని ఆ వేషధారణలో చూపినట్లు వెల్లడించారు.
ఇక సలార్ విషయానికి వస్తే, ఈ సినిమా కథ ఏంటంటే.. ఖాన్సార్ అనే ఒక పవర్ ఫుల్ నగర సింహాసాని గెలుచుకోవడం కోసం మూడు కుటుంబాలు మధ్య జరిగే పోరాటమే సలార్. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆ సింహాసానికి అసలైన వారసుడు ప్రభాస్.
ఇదే పాయింట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా కనిపిస్తుంది. ఏడు రాజయాలను కంట్రోల్ చేసే ఒక సింహాసనం. ఆ సింహాసనం కోసం ఎంతో మంది పోరాడుతూ ఉంటారు. అయితే ఆ సింహాసానికి అసలైన వారసుడు 'జాన్ స్నో' అని ఎవరికి తెలియదు. ఇదే నేపథ్యంతో ప్రశాంత్ నీల్ సలార్ ని నడిపిస్తున్నారని తెలుస్తుంది.
కేజీఎఫ్ 'వైకింగ్స్'కి, సలార్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కి కంప్లీట్ కాపీ అనడం లేదు. కానీ ఆ రెండు వెబ్ సిరీస్ రిఫరెన్స్ లు ఈ రెండు చిత్రాల్లో కనిపిస్తున్నాయి అంటున్నారు కొందరు నెటిజెన్స్. ఈ విషయాన్ని కొందరు నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు.
Next Story