Mon Dec 23 2024 09:17:18 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో సందడి చేయబోతున్న విక్రమ్ 'కోబ్రా'
ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇర్ఫాన్ పఠాన్
ఆగష్టు 31న థియేటర్లలో విడుదలైన కోబ్రా సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతోంది. విలక్షణ నటుడు విక్రమ్ నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 28 నుండి OTT ప్లాట్‌ఫారమ్ SonyLIVలో విడుదల అవుతోంది.
ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, రోషన్ మాథ్యూస్ కూడా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా.. ఓటీటీ ద్వారా చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ మంచి సంగీతం అందించారు. ఇది సెప్టెంబర్ 28 నుండి SonyLIVలో ప్రసారం అవుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్‌లో విక్రమ్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రం ఓటీటీ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు.
విక్రమ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1 ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నాడు.
- Tags
- CobraMovie
- OTT
Next Story