Mon Dec 23 2024 06:49:07 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రి - కొడుకుల భావోద్వేగ కథ "విమానం"
తాజాగా ఈ సినిమా టీజర్ ను వదిలారు మేకర్స్. 1.34 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా విమానం. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అవగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలన్న కోరిక ఉన్న ఓ కుర్రాడు, అంగవైకల్యంతో వీల్ చైర్ కే పరిమితమైన తండ్రి మధ్య జరిగిన భావోద్వేగ కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమా టీజర్ ను వదిలారు మేకర్స్. 1.34 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అంగవైకల్యంతో బాధపడే వీరయ్య.. తన కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. తండ్రిని విమానం ఎక్కించాలని అడుగుతుంటాడు. మరి ఆ కొడుక్కి తండ్రి ఏం చెప్పాడు. పెద్దయ్యాక ఆ కుర్రాడు విమానం ఎక్కాడా లేదా ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. జూన్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
Next Story