Mon Dec 23 2024 15:17:04 GMT+0000 (Coordinated Universal Time)
అల్లు అరవింద్ బర్త్ డే స్పెషల్ : వినరో భాగ్యము విష్ణు కథ టీజర్
సస్పెన్స్, లవ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతుందని టీజర్లో చెప్పేశారు. అసలు కంటెంట్ ఏమిటనేది
ప్రస్తుతం టాలీవుడ్ లో.. వైవిధ్యమైన స్టోరీలను ఎంచుకుంటూ.. సరికొత్త సినిమాలను చేస్తున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళీ కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కాశ్మీర హీరోయిన్ గా పరిచయమవుతోంది. తాజాగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది. నేడు అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
హీరో పేరు విష్ణు. ఈ కథ తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగే 'విష్ణు' అనే యువకుడి ప్రేమకథగా చూపించారు. సస్పెన్స్, లవ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతుందని టీజర్లో చెప్పేశారు. అసలు కంటెంట్ ఏమిటనేది తరువాత చెబుతామంటూ టీజర్ ను కట్ చేశారు. ఇక సినిమాలోని పలు సన్నివేశాలను బట్టి.. కాస్త ఆసక్తికరంగానే ఉండబోతుందని తెలుస్తోంది. సీనియర్ నటుడు మురళీశర్మతో బాలయ్య, బన్నీ స్టెప్పులు వేయించారు. ఇవి కామెడీ ట్రాక్ లో కనిపించాయి. శుభలేఖ సుధాకర్, ఆమని, శరత్ లోహితశ్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 17న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది.
Next Story