‘వినయ విధేయ రామ’లో ఆ సీన్స్ తీసేయడం మంచిదే
బోయపాటి సినిమా అంటే ఏ హీరోతో అయినా అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే హీరో ని ఆ విధంగా చూపిస్తాడు బోయపాటి. రామ్ చరణ్ [more]
బోయపాటి సినిమా అంటే ఏ హీరోతో అయినా అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే హీరో ని ఆ విధంగా చూపిస్తాడు బోయపాటి. రామ్ చరణ్ [more]
బోయపాటి సినిమా అంటే ఏ హీరోతో అయినా అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే హీరో ని ఆ విధంగా చూపిస్తాడు బోయపాటి. రామ్ చరణ్ తో బోయపాటి సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు మరింత ఎక్కువ అయిపోయాయి. దానికి తోడు ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ కూడా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో ఈసినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసారు.
సంక్రాంతి కానుకగా రిలీజ్ ఈసినిమా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈమూవీ లో యాక్షన్ డోస్ చాలా ఎక్కువ అయింది. కొన్నికొన్ని సీన్స్ అయితే మరీ అతిగా అనిపించాయి. అందులో ట్రైన్ సీన్ .. విలన్ ను కరిచి పామే చచ్చిపోవడం వంటి సీన్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
అలానే చరణ్ విలన్స్ తలకాయలు నరికినప్పుడు అవి గ్రద్దలు తీసుకెళ్లే సీన్ చాలా అతిగా వున్నాయనే టాక్ వచ్చింది. వీటివల్ల సినిమాకు బ్యాడ్ టాక్ వస్తుందని టీమ్ గ్రహించి ఆ సీన్స్ ను లేపేసి ఆలోచన చేస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆ సీన్స్ తీసేయడం వల్లన సినిమాకు కొంతవరకూ ఫలితం వస్తుందని భావిస్తున్నారు. అయితే మరి ఆ సీన్స్ ఎప్పుడు డిలీట్ చేస్తారో మాత్రం క్లారిటీ లేదు.