Mon Jan 13 2025 09:05:35 GMT+0000 (Coordinated Universal Time)
‘వినయ విధేయ రామ’ అప్ డేట్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'వినయ విధేయ రామ'. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను 2019 సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. డిసెంబర్ 10 నుండి హైదరాబాద్‌లో భారీ సెట్లో ఓ పాటను చిత్రీకరించబోతున్నారు.
Next Story