పక్కా డిజాస్టర్..!
రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన వినయ విధేయ రామ విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఊర మాస్ గా తెరెకెక్కిన [more]
రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన వినయ విధేయ రామ విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఊర మాస్ గా తెరెకెక్కిన [more]
రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన వినయ విధేయ రామ విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఊర మాస్ గా తెరెకెక్కిన ఈ సినిమాలో సిల్లీ సీన్స్, మాస్ అండ్ యాక్షన్ ఎక్కువవడంతో సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా పడలేదు. కానీ మాస్ ప్రేక్షకులు మెచ్చడంతో.. వినయ విధేయ రామకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చాయి. మొదటి వారంలో మెరుగ్గా ఉన్న కలెక్షన్స్ రెండో వారంలోకి ప్రవేశించగానే… డిజాస్టర్ కి దగ్గరకి వచ్చేలా కనబడుతుంది. ఈ సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఈ ఏడాది మొదటి భారీ డిజాస్టర్ కాగా… వినయ విధేయరామ ఈ ఏడాది సెకండ్ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోయేలా కనబడుతుంది. రామ్ చరణ్ ని మాస్ ప్రేక్షకులు ఎంతగా గట్టెక్కించినా.. వినయ విధేయ రామని కాపాడలేకపోయారు. అందుకే చివరకు వినయ విదేయ రామ డిజాస్టర్ కావడం పక్కా అంటున్నారు.
ఏరియా షేర్స్(కోట్లలో)
నైజాం 12.50
సీడెడ్ 11.55
అర్బన్ ఏరియాస్ 8.05
గుంటూరు 6.26
ఈస్ట్ గోదావరి 5.23
వెస్ట్ గోదావరి 4.25
కృష్ణ 3.56
నెల్లూరు 2.77
ఏపీ, టీఎస్ షేర్స్ 54.17
ఇతర ప్రాంతాలు 5.35
ఓవర్సీస్ 1.40
వరల్డ్ వైడ్ షేర్స్ 60.92 కోట్లు