ఒక్క డిజాస్టర్ ఆయన జీవితాన్ని మార్చేసింది
ఒక్క డిజాస్టర్ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో. మొన్నటివరకు స్టార్ డైరెక్టర్ గా ఉన్న బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో తీసిన ‘వినయ విధేయ రామ’ [more]
ఒక్క డిజాస్టర్ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో. మొన్నటివరకు స్టార్ డైరెక్టర్ గా ఉన్న బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో తీసిన ‘వినయ విధేయ రామ’ [more]
ఒక్క డిజాస్టర్ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో. మొన్నటివరకు స్టార్ డైరెక్టర్ గా ఉన్న బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో తీసిన ‘వినయ విధేయ రామ’ పూర్తిగా నిరాశపరచడమే కాదు బోయపాటిని కొద్దిగా కిందకి నెట్టేసింది.ఇది ముఖ్యంగా బోయపాటి పారితోషికం పై పడింది. ఒక్క ప్లాప్ ప్రభావం బోయపాటిపై గట్టిగానే పడింది.
వినయ విధేయ రామ మూవీ కోసం బోయపాటి అక్షరాలా 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.అయితే పారితోషికంలో భారీ కోత కనిపిస్తోందిప్పుడు. ఎందుకంటే బోయపాటి నెక్స్ట్ బాలయ్య తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాకి బాలయ్యే నిర్మాత. సింహ, లెజెండ్ సినిమాలకు బోయపాటి 4 కోట్లు వరకు తీసుకున్నాడు. ఆ తరువాత అతని రేంజ్ మారిపోయింది. 6 – 8 వరకు తీసుకునేవాడు.
అయితే ఇప్పుడు కాస్త అటూ ఇటుగా ఆ పారితోషికాన్నే బోయపాటికి ఫిక్స్ చేశాడట బాలకృష్ణ. బాలయ్య సొంత సినిమా కాబట్టి ఆయన ఇచ్చిందే తీసుకోవాలి. 'వినయ విధేయ రామ' డిజాస్టర్ అవ్వడంతో బోయపాటి కూడా బాలయ్యకు నో చెప్పలేదని టాక్.