Mon Dec 23 2024 14:23:56 GMT+0000 (Coordinated Universal Time)
బేబీ ఫేమ్ 'విరాజ్ అశ్విన్' నటించిన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది
విరాజ్ అశ్విన్ నటించిన 'బేబీ' సినిమా భారీ హిట్ గా
విరాజ్ అశ్విన్ నటించిన 'బేబీ' సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఆ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇప్పుడు అతడు నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో సందడి చేయబోతోంది. ఆ సినిమా 'మాయాపేటిక'. త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఆహాలో స్ట్రీమ్ అవ్వనుంది మాయాపేటిక సినిమా.
థ్యాంక్యూ బ్రదర్ మూవీ డైరెక్టర్ రమేష్ రాపర్తి 'మాయాపేటిక' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 30న థియేటర్లలోకి వచ్చింది. విరాజ్ అశ్విన్ తోపాటు సిమ్రన్ కౌర్, పాయల్ రాజ్పుత్ ఇందులో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది. రిలీజైన రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మాయాపేటిక సినిమా ఆరు చిన్న కథల ఆంథాలజీ. ఓ మొబైల్ ఫోన్ ద్వారా వీళ్లు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటన్నది సినిమాలో చూపిస్తారు.
Next Story