Fri Dec 20 2024 08:55:51 GMT+0000 (Coordinated Universal Time)
Kohli - Anushka : కోహ్లీ కొడుకు పేరు.. 'అకాయ్' అంటే అర్ధం ఏంటి..!
అనుష్క, కోహ్లీ తమ కొడుకుకి 'అకాయ్' అనే కొత్త పేరుని పెట్టిన విషయం తెలిసిందే. ఇంతకీ దాని అర్ధం ఏంటి..!
Kohli - Anushka : ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. తమ లైఫ్ లోకి రెండు బేబీకి ఆహ్వానం పలికారు. 2017లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. 2021లో 'వామిక'కు జన్మనిచ్చారు. అనంతరం మూడేళ్ళ తరువాత ఇప్పుడు తమ రెండు బిడ్డగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న అనుష్క డెలివరీ కాగా, 20వ తేదీన కోహ్లీ అధికారికంగా అందరికి తెలియజేసారు.
వామిక లిటిల్ బ్రదర్ 'అకాయ్' ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు అంటూ తెలియజేస్తూ.. బాబు పేరుని కూడా అనౌన్స్ చేసేసారు కోహ్లీ. ఇక కొత్తగా ఉన్న ఈ పేరుని చూసిన అభిమానులు.. దాని అర్ధం ఏంటని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈక్రమంలోనే చాలామంది ఆ పేరుకి అర్ధం.. 'మెరుస్తున్న చంద్రుడు' అని, ఆ పేరు టర్కిష్ భాష నుండి ఉద్భవించిందని చెప్పుకొస్తున్నారు. అయితే కోహ్లీ, అనుష్క ఆ పేరుని మన సంస్కృత భాష నుంచి తీసుకోని పెట్టారని కొంతమంది చెబుతున్నారు.
అకాయ్ అనే దాని అర్థం చాలా ప్రత్యేకమైనదని, సంస్కృత భాషలో, అకాయ్ అంటే ఖచ్చితమైన ఆకారం లేనిది, అది నిరాకారమైనది అనే అర్ధం వస్తుందని చెబుతున్నారు. హిందూ ధర్మంలో శివుడుని నిరాకారుడిగా పరిగణిస్తారు. ఈక్రమంలోనే అకాయ్ అంటే శివుడి పేరుగా చెబుతున్నారు. గతంలో కుమార్తెకు కూడా వామిక అంటూ దుర్గాదేవి పేరు పెట్టారు. ఇప్పుడు కొడుకు పేరుని కూడా హిందూ ధర్మాన్ని అనుసరిస్తూనే పెట్టినట్లు చెప్పుకొస్తున్నారు.
Next Story