Mon Dec 23 2024 10:41:22 GMT+0000 (Coordinated Universal Time)
Virat Kohli : మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న అనుష్క, కోహ్లీ..!
కోహ్లీ, అనుష్క మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారట. త్వరలోనే తమ రెండో బేబీకి ఆహ్వానం..
Virat Kohli : భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పాపకి కూడా జన్మనించిన సంగతి తెలిసిందే. 2020 సంవత్సరంలో లాక్ డౌన్ టైములో ఈ స్టార్ కపుల్.. తమ మొదటి బేబీ బర్త్ గురించిన అప్డేట్ ఇచ్చారు. అనుష్క ప్రెగ్నెంట్ అని తెలియజేసేలా ఒక ఫోటో షేర్ చేశారు. అనంతరం 2021 జనవరి 11న వీరిద్దరూ ఒక పాపకి ఈ లోకంలోకి ఆహ్వానం పలికారు.
ఆ పాపకి 'వామిక' అనే పేరుని కూడా పెట్టారు. కోహ్లీ వారసత్వం నుంచి ప్రిన్సెస్ గా వామిక పరిచయం అయ్యినందుకు అభిమానులు చాలా సంతోష పడ్డారు. అయితే ఫ్యాన్స్ అంతా కింగ్ వారసుడి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ క్రికెట్ రారాజుకి కుమారుడు పుడితే చూడాలని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే అనుష్క తన సెకండ్ ప్రెగ్నన్సీ గురించి ఎప్పుడు చెబుతుందా అని వేచి చూస్తున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో అనుష్క రెండోసారి అమ్మ కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా అనుష్క అండ్ కోహ్లీ కలిసి ఒక హోటల్ లో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో చూసిన కొందరు.. అనుష్క బేబీ బంప్ తో కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీడియోలో ఆ విషయం పెద్దగా పెద్దగా తెలియడం లేదు.
మరి ఈ ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాలి, లేదంటే అనుష్క విరాట్ అధికారికంగా చెప్పేవరకు ఎదురు చూడాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒక పక్క వరల్డ్ కప్ కోహ్లీ దంచుకొట్టడం, రీసెంట్ గా సచిన్ రికార్డుని బ్రేక్ చేయడం ఈ అన్ని శుభాలు మధ్య.. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ నిజమనే శుభవార్త కూడా వింటే చాలా సంతోష పెడతామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Next Story