Mon Dec 23 2024 10:45:42 GMT+0000 (Coordinated Universal Time)
"విరాటపర్వం" రిలీజ్ డేట్ ఫిక్స్ !
రానా దగ్గుబాటి - సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న ప్రేమకథాచిత్రం విరాటపర్వం.
హైదరాబాద్ : విరాటపర్వానికి వాయిదాల పర్వం ముగింపు పలికింది. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీ ఖరారయింది. రానా దగ్గుబాటి - సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న ప్రేమకథాచిత్రం విరాటపర్వం. గతేడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జూన్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ మేరకు స్పెషల్ వీడియో పంచుకుంది. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దగ్గుబాటి సురేశ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, నివేదా పేతురాజ్, సాయిచంద్, నందిదాతాస్, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. విరాటపర్వం చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.
Next Story