Mon Dec 23 2024 06:55:51 GMT+0000 (Coordinated Universal Time)
27 రోజుల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష
తొలి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో.. సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో..
సాయిధరమ్ తేజ్- సంయుక్త మీనన్ జంటగా రూపొందిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో.. సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్వగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ సినిమాను నిర్మించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. విరూపాక్ష సినిమా విడుదలై నిన్నటికి 27 రోజులు పూర్తవ్వగా.. ఈ సినిమా రూ.100 కోట్లను వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర టీమ్ అధికారిక పోస్టర్ ను వదిలింది.
కాగా.. సాయిధరమ్ తేజ్ కెరియర్ లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా విరూపాక్ష నిలిచింది. కథను సాగదీయకుండా చెప్పడం, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు, ఆజానీశ్ లోక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈనెల 21న విరూపాక్ష నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. థియేటర్లలో కోట్లు కొలగొట్టిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Next Story