Mon Dec 23 2024 13:23:40 GMT+0000 (Coordinated Universal Time)
నేషనల్ అవార్డు పై విశాల్ వైరల్ కామెంట్స్.. చెత్తతో సమానం..!
ఈ ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల పై తమిళ్ హీరో విశాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇటీవల భారత్ ప్రభుత్వం నేషనల్ అవార్డులను (National Award) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న హేమాహేమీలు అంతా జాతీయ అవార్డు పోటీలో నిలబడ్డారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఆ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఈ సంవత్సరం అయితే తెలుగు సినిమాకి అత్యధిక పురస్కారాలు అందాయి. అంతేకాకుండా ఎన్నో ఏళ్లగా ఒక కలలా ఉన్న ఉత్తమ నటుడు అవార్డుని అల్లు అర్జున్ (Allu Arjun) గెలుచుకోవడం టాలీవుడ్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
కాగా ‘మార్క్ ఆంటోని’ (Mark Antony) ప్రమోషన్స్ లో ఉన్న తమిళ్ హీరో విశాల్ (Vishal).. ఈ జాతీయ అవార్డుల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విశాల్ కి నేషనల్ అవార్డులకు సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. "ఒకరు ఇచ్చే అవార్డుల పై నాకెప్పుడూ నమ్మకం లేదు. ప్రేక్షకులు అందరూ కలిసి ఇచ్చేదే నిజమైన అవార్డు. వారందరి ఆదరణ, ఆశీస్సులు వల్లే నేను పరిశ్రమలో ఇన్నాళ్లు నటిస్తూ వచ్చాను. ఒకవేళ నా చిత్రాలకు అవార్డులు వచ్చినా వాటిని నేను చెత్తబుట్టలో పడేస్తాను" అంటూ పేర్కొన్నాడు.
అలాగే విశాల్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ద్వారా పొలిటికల్ కెరీర్ స్టార్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీని పై కూడా ప్రశ్నించగా.. "ఒకప్పుడు నడిగర్ సంగంలో నన్ను చేరమని చాలా సార్లు అడిగిన తరువాతే నేను జాయిన్ అయ్యాను. కానీ కొన్నాళ్ల తరువాత నన్ను ఎవరు జాయిన్ అవ్వమని కోరారో, నేను వారి మీదే పోటీ చేసి ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందా. అదే విధంగా ఫ్యూచర్ లో ఏదైనా జరగవచ్చు" అని బదులిచ్చాడు.
దీంతో భవిషత్తులో విశాల్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఉండొచ్చని భావించొచ్చు. కాగా విశాల్ చిన్నతనంలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే నివసించారు. దీంతో అక్కడి ప్రజలతో విశాల్ కి అనుబంధం ఉంది. ఈక్రమంలోనే విశాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కనిపించవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వైఎస్ జగన్ (YS Jagan) తన ఫేవరెట్ లీడర్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
Next Story