Mon Dec 23 2024 16:10:06 GMT+0000 (Coordinated Universal Time)
గాయపడిన విశాల్.. ఈసారి గాయం మరింత తీవ్రం
దీంతో వెంటనే షూటింగ్ ఆపేశారు. ఇటీవల పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి
హీర్ విశాల్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో విశాల్ ఏ మాత్రం వెనకడుగు వేయడు. అయితే విశాల్ చేస్తున్న స్టంట్స్, యాక్షన్ సీన్స్ కారణంగా అతడు గాయపడుతూ ఉన్నాడు. విశాల్.. వినోద్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'లాఠీ'. చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్ సీన్ కోసం చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ గాయపడ్డాడు. దీంతో షూట్ రద్దు చేశారు. విశాల్ కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు.
'లాఠీ' సినిమా ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. విడుదల తేదీ దగ్గర పడటంతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ లో విశాల్ చేతికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే షూటింగ్ ఆపేశారు. ఇటీవల పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణ ప్రారంభించిన విశాల్ షూటింగ్లో భాగంగా మరోసారి ప్రమాదానికి గురైయ్యాడు. గతంతో పోలిస్తే ఈ సారి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు ప్రభు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో విశాల్ కు హెయిర్ లైన్ ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు మరోసారి గాయపడడంతో విశాల్ అభిమానులు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో విశాల్ పోలీస్‌గా నటిస్తూ ఉండడంతో.. ఫిట్ గా ఉండాలని భావిస్తూ ఉన్నాడు. ఫిట్ లుక్ కోసం విశాల్ కొన్ని కిలోలు తగ్గినట్లు తెలుస్తోంది.
Next Story