Sun Dec 22 2024 22:05:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నయన్ వివాహం.. క్యూ ఆర్ కోడ్ తోనే?
విష్నేష్ శివ - నయనతార వివాహం నేడు జరగనుంది. మహాబలిపురంలో జరగనున్న ఈ వివాహవేడుకలకు ముఖ్యులను మాత్రమే ఆహ్వానించారు
విష్నేష్ శివ - నయనతార వివాహం నేడు జరగనుంది. మహాబలిపురంలో జరగనున్న ఈ వివాహవేడుకలకు ముఖ్యులను మాత్రమే ఆహ్వానించారు. ఇప్పటికే వెడ్డింగ్ ఇన్విటేషన్ లు కొందరికి మాత్రమే ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ను అనుసరించి వారిని వివాహ వేదికలోపలికి అనుమతిస్తారు. మహాబలిపురంలో జరగనున్న ఈ వివాహ వేడుకలకు తమిళ సినిమా పరిశ్రమ నుంచి ఎక్కువ మంది హాజరయ్యే అవకాశముంది.
అభిమానుల తాకిడి...
అయితే ఈ వివాహ వేడుకలకు స్పెషల్ డ్రెస్ కోడ్ ను నిర్ణయించారని తెలిసింది. క్యూ ఆర్ కోడ్, ప్రత్యేక దుస్తులు ధరించి వస్తేనే వారిని లోనికి అనుమతి ఇస్తారు. విష్నేష్ శివ - నయనతార వివాహం జరుగుతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు ప్రచారంలో ఉన్నా నేటితో వాటికి తెరపడనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా విష్నేష్ శివ, లేడీ సూపర్ స్టార్ గా నయనతార వివాహం వీక్షించాలని వారి అభిమానులు ఇప్పటికే మహాబలిపురం చేరుకున్నారు. అయితే వారికి నో ఎంట్రీలేక పోవడంతో వివాహం తర్వాత బయటకు వచ్చి అభిమానులకు కన్పించనున్నారు.
Next Story