విశ్వక్ సేన్ కి అన్ని కోట్లు కావాలా..?
హీరోగా రెండుమూడు సినిమాల్లో నటించిన విశ్వక్ సేన్ కి కాస్త పొగరు ఎక్కువే. ఫలక్ నుమా దాస్ విషయంలో విశ్వక్ సేన్ చేసిన హంగామా అంతా ఇంతా [more]
హీరోగా రెండుమూడు సినిమాల్లో నటించిన విశ్వక్ సేన్ కి కాస్త పొగరు ఎక్కువే. ఫలక్ నుమా దాస్ విషయంలో విశ్వక్ సేన్ చేసిన హంగామా అంతా ఇంతా [more]
హీరోగా రెండుమూడు సినిమాల్లో నటించిన విశ్వక్ సేన్ కి కాస్త పొగరు ఎక్కువే. ఫలక్ నుమా దాస్ విషయంలో విశ్వక్ సేన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తర్వాత నాని నిర్మాణంలో హిట్ సినిమాతో హిట్ కొట్టాక విశ్వక్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. అవకాశాలు కోసం వేచి చూసిన విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండ లా ఫీలవుతుంటాడు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ కండిషన్స్ కి పీవీపీ సంస్థ సలాం కొట్టింది అనే టాక్ వినబడుతుంది. విశ్వక్ సేన్ హీరోగా పీవీపీ వారు తమిళ సినిమా ఓ మై కదవులే రీమేక్ హక్కులను కొని ఆ సినిమా ని రీమేక్ చేయాలనుకున్నారు. అయితే విశ్వక్ సేన్ తో సంప్రదించగా విశ్వక్ ఆ మూవీ చెయ్యనని చెప్పేసాడు. ఎందుకంటే పారితోషకం విషయంలో వచ్చిన తేడాల వలన.
అయితే విశ్వక్ సేన్ తమిళ ఓ మై కదవులే రీమేక్ చేస్తున్నాడంటూ మీడియాలో వార్తలు రావడం విశ్వక్ సేన్ దాన్ని ఖండించడం జరిగింది. ఈలోపు పీవీపీ వారు మరో హీరోతో తమిళ ఓ మై కదవులే ని రీమేక్ చేస్తారనుకుంటే.. కాదు మాకు విశ్వక్ సేన్ అయితేనే బావుంటుంది.. సినిమాకి క్రేజ్ వస్తుంది కాబట్టి.. మల్లి పీవీపీ వాళ్ళు విశ్వక్ ని సంప్రదించడం విశ్వక్ సేన్ అడిగిన రెండు కోట్ల పారితోషకాన్ని తల ఊపడం జరిగింది అని అంటున్నారు. అయితే విశ్వక్ రేంజ్ కి రెండు కోట్లు ఎక్కువే అయినా.. దర్శకుడు తరుణ్ భాస్కర్ రియాకమండేషన్ తో పీవీపీ వారు విశ్వక్ అడిగింది కాదనలేకుండా ఇస్తున్నారట. తరుణ్ భాస్కర్ తమిళ ఓ మై కదవులే కి తెలుగు మాటలు రాస్తున్నాడు. అలాగే విశ్వక్ కి తరుణ్ తో మంచి అనుబంధం ఉంది. అలా విశ్వాల్ ని తమిళ ఓ మై కదవులే రీమేక్ కి పీవీపీ వారు ఒప్పించారన్నమాట.