Mon Dec 23 2024 09:49:55 GMT+0000 (Coordinated Universal Time)
Gangs Of Godavari : రికార్డులు సృష్టిస్తున్న విశ్వక్ సేన్ మూవీ సాంగ్..
విశ్వక్సేన్ కొత్త సినిమా ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.
Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్సేన్ గ్రే షేడ్ క్యారెక్టర్లో నటిస్తూ చేస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’. నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో అందాల భామ అంజలి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ‘సుట్టంలా సూసి పోకల’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. విశ్వక్ అండ్ నేహశెట్టి పై తెరకెక్కిన ఈ లవ్ ట్రాక్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆగష్టులో రిలీజ్ అయిన ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ లిరికల్ సాంగ్ 25 మిలియన్ వ్యూస్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక ఈ సాంగ్ ని ఇంతలా ఆదరించినందుకు మూవీ మేకర్స్ ఆడియన్స్ కి థాంక్యూ చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఆ సూపర్ హిట్ సాంగ్ ని మరోసారి మీరుకూడా చూసేయండి.
కాగా ఈ మూవీ ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో పోస్టుపోన్ చేశారు. 2024 మార్చి 8న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. ఈ మధ్యలో చాలా సినిమాల రిలీజ్ లు ఉండడంతో గ్యాంగ్స్ అఫ్ గోదావరి విడుదలని మార్చి వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా ఇసుక మాఫియా చుట్టూ తిరగనుందని తెలుస్తుంది. ఆ మాఫియాలో హీరో ఎలా ఎదిగాడు, ఏ సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది ఊర మాస్ గా చూపించబోతున్నారు.
Next Story