Mon Dec 23 2024 09:18:47 GMT+0000 (Coordinated Universal Time)
విశ్వక్ సేన్ సంచలన ట్వీట్ ఎవరు గురించి..?
బ్యాక్గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కరు మన గేమ్ మార్చడానికి ప్రయత్నిస్తారు. విశ్వక్ సేన్ సంచలన ట్వీట్ ఎవరు గురించి..?
టాలీవుడ్ యువ హీరోల్లో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ హీరో ప్రస్తుతం మూడు చిత్రాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమా ముందుగా రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. గోదావరి బ్యాక్డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
డిసెంబర్ 8న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మూవీ టీం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టి గ్లింప్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఒక సంచలన ట్వీట్ చేశాడు. "బ్యాక్గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కరు మన గేమ్ మార్చడానికి ప్రయత్నిస్తారు. నేను గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాని ప్రాణం పెట్టి పని చేశాను. డిసెంబర్ 8న వస్తున్నాము. హిట్ చేస్తారా లేదా అట్టర్ ప్లాప్ చేస్తారా అది మీ ఇష్టం. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఒకవేళ డిసెంబర్ లో సినిమా విడుదల కాకపోతే నేను ఇంక ఈ సినిమా ప్రమోషన్స్ లో కనబడును" అంటూ పోస్ట్ వేశాడు.
అయితే ఈ పోస్టుని కొద్దిసేపటికి తొలిగించేశాడు. ఇంతకీ అసలు విశ్వక్ సేన్ ఎవరి గురించి ఈ ట్వీట్ చేశాడు..? గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ సమయంలోనే నాని 'హాయ్ నాన్న', వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వ్యాలెంటైన్', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' రిలీజ్లు కూడా ఉన్నాయి. దీంతో రిస్క్ చేయడం ఎందుకని భావించి నిర్మాత రిలీజ్ డేట్ మార్చాలని అనుకున్నట్లు, అందుకు విశ్వక్ సేన్ ఒప్పుకోలేదని, ఆ కోపంతోనే విశ్వక్ అలా పోస్ట్ వేశాడని సమాచారం.
ఇక విశ్వక్ చేసిన పోస్టు పై నెటిజెన్స్ నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. డబ్బులు పెట్టే నిర్మాతకు తెలియదా ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి అన్నది. కోపంతో ఇలాంటి పనులు చేసి నీకు ఉన్న ఇమేజ్ ని పోగొట్టుకోకు అంటూ కామెంట్స్ చేశారు. మరి ఈ మూవీని చెప్పిన తేదీకే తీసుకు వస్తారా..? లేదా..? చూడాలి.
Next Story