Tue Apr 01 2025 06:47:37 GMT+0000 (Coordinated Universal Time)
క్షమాపణలు చెప్పిన నటుడు విశ్వక్ సేన్
తన చిత్రానికి నష్టం కలిగే సూచనలు కనిపిస్తుండడంతో

లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ కార్యక్రమంలో కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను మేకల సత్యం పాత్ర పోషించానని పృథ్వీ తెలిపారు. అయితే కొన్ని వ్యాఖ్యలు ఓ పార్టీని టార్గెట్ చేసినట్లుగా ఉండడంతో 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో 68 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.
తన చిత్రానికి నష్టం కలిగే సూచనలు కనిపిస్తుండడంతో లైలా చిత్ర హీరో విష్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను క్షమాపణలు చెబుతున్నానని, తాము ఈవెంట్ లో లేనప్పుడు పృథ్వీ ఆ వ్యాఖ్యలు చేశాడని విష్వక్సేన్ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తన సినిమా ఈవెంట్ లో చేశాడు కాబట్టి తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. పృథ్వీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, వాటిని తమకు అపాదించవద్దని విజ్ఞప్తి చేశారు. రిలీజ్ రోజే హెడ్ డీ ప్రింట్ బయటికి తెస్తామని బెదిరిస్తున్నారని విష్వక్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. పృథ్వీ చెప్పినట్టు సినిమాలో అన్ని మేకలు లేవని విష్వక్సేన్ వివరణ ఇచ్చారు. పృథ్వీకి, మాకు ఎలాంటి సంబంధం లేదు, పృథ్వీ ఈ సినిమాలో ఒక నటుడు మాత్రమే అని స్పష్టం చేశారు. ఈవెంట్ అయ్యాక.. తాము ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన వ్యాఖ్యల గురించి తెలుసుకున్నామని అన్నారు.
Next Story