Sun Dec 22 2024 02:20:34 GMT+0000 (Coordinated Universal Time)
Surabhi : చావు అంచులు వరకు వెళ్లి వచ్చా.. హీరోయిన్ వైరల్ పోస్ట్..
చావు అంచులు వరకు వెళ్లి వచ్చా అంటూ భయంతో టాలీవుడ్ హీరోయిన్ సురభి ఇన్స్టాగ్రామ్ పోస్ట్.
Surabhi : టాలీవుడ్ హీరోయిన్ సురభి చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్స్ప్రెస్ రాజా, జెంటిల్ మెన్, ఒక్క క్షణం, బీరువా వంటి హిట్ సినిమాలతో ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఈ భామ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ కనిపిస్తూ లో ప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తూ వస్తుంటారు. అయితే తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ లో.. 'చావు అంచులు వరకు వెళ్లి వచ్చా' అంటూ చేసిన ఓ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
అసలు ఏమైందంటే.. ఈ హీరోయిన్ రీసెంట్ గా ఒక విమాన ప్రయాణం చేసారు. ఆ ప్రయాణం సమయంలో సాంకేతిక లోపు ఏర్పడి విమానం కంట్రోల్ తప్పింది. దీంతో విమానం క్రాష్ అయ్యే పరిస్థితికి వచ్చిందట. అయితే పైలెట్ తన ఎక్స్పిరెన్స్ అంతా ఉపయోగించి.. విమానాన్ని సేఫ్ గా ఎయిర్ పోర్టు ల్యాండ్ చేశారట. అయితే కొన్ని గంటలు పాటు విమానంలో ఉన్న ప్రతి ఒక్కరు భయంతో చావు అంచులు వరకు వెళ్లి వచ్చారట. ఆ ప్రయాణం తలుచుకుంటూనే చాలా భయంగా ఉందని సురభి.. తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు.
ప్రస్తుతం ఈ పోస్టు కాస్త నెట్టింట వైరల్ గా మారింది. కాగా సురభి ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు. చిరు చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవికి మొత్తం ముగ్గురు చెల్లెళ్ళు ఉండనున్నారని. వారిలో ఒకరు సురభి అని సమాచారం. ఇటీవల ఈ మూవీ సెట్స్ నుంచి ఓ ఫోటో కూడా బయటకి వచ్చింది. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Next Story