Thu Dec 26 2024 22:48:27 GMT+0000 (Coordinated Universal Time)
Vivek Agnihotri: సంచలన దర్శకుడి మరో సినిమా రెండు భాగాలుగా!!
బిజినెస్ వర్కౌట్ అవుతుందనో, లేక సినిమా మీద హైప్ తెప్పించవచ్చనో
బిజినెస్ వర్కౌట్ అవుతుందనో, లేక సినిమా మీద హైప్ తెప్పించవచ్చనో సినిమాలను రెండేసి పార్ట్ లలో తీయడాన్ని మొదలు పెట్టారు. కథ నిడివి ఎక్కువగా ఉంటే ఒకే సినిమాగా తీయడం కష్టమని కూడా చాలామంది దర్శకులు చెబుతూ వస్తుంటారు. అందుకే తాము రెండు పార్టులుగా సినిమా తీయడానికి సిద్ధమయ్యామని కవర్ చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే కొన్ని సినిమాలకు సంబంధించి మొదటి పార్ట్ ప్లాప్ అవ్వడంతో రెండో పార్ట్ తీసినా ప్రయోజనం లేదనుకుని ఆ కథను అలాగే ఆపేస్తూ ఉంటారు.
ఇప్పుడు మరో సంచలన దర్శకుడు తన సినిమాను రెండు పార్ట్ లలో తీయాలని ఫిక్స్ అయ్యాడు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో పాపులారిటీని దక్కించుకున్న వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు 'ది ఢిల్లీ ఫైల్స్' ను తీసుకుని వస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించడమే కాకుండా రెండు భాగాలుగా సినిమా విడుదల కాబోతోందని తెలిపారు. TheDelhiFiles కథ కు సంబంధించి మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయబోతున్నామని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. మొదటి భాగానికి ది బెంగాల్ ఛాప్టర్ అని పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించనున్నారు.
Next Story