Sun Dec 22 2024 14:56:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోని ఆ ప్రాంతంలో RRRరికార్డ్ బ్రేక్ చేసిన వీరయ్య
మూడు రోజులకు గాను RRR.. రూ.9.4 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ కలెక్షన్స్ ని వాల్తేరు వీరయ్య..
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. ఈ సంక్రాంతికి విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడంతో పాటు.. తన కామెడీ టైమింగ్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. దాంతో.. వీరయ్యకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. మొదటి రోజే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రూ.108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత.. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య అలరించాయి.
తాజాగా.. వాల్తేరు వీరయ్య ఓ రికార్డు సృష్టించింది. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో విడుదలైన మూడు రోజులకు గాను RRR.. రూ.9.4 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ కలెక్షన్స్ ని వాల్తేరు వీరయ్య అలవోకగా దాటేసింది. మూడ్రోజుల్లో రూ.11.23 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ను ఇంట్రెస్టింగ్ గా చూపించారు. వీరయ్య, విక్రమ్ ల మధ్య సన్నివేశాలను ఎమోషనల్ గా చూపించాడు డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ అంటున్నారు ఫ్యాన్స్.
Next Story